వడ్డెరల ప్రధాన అభ్యర్థనలు (డిమాండ్లు) కుల అభివృద్ధి మరియు ఆర్థిక సాధికారత కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుట 1. ఎస్.టి. జాబితాలో చేర్చాలి వడ్డెర్లను షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్.టి.) జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 2. ఆధునిక పరికరాల సబ్సిడీ ప్రొక్లైన్లు, కంప్రెసర్లు, మిల్లర్లు, ట్రాక్టర్లు వంటి ఆధునిక పనిముట్లకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఇవ్వాలని అభ్యర్థన. 3. చిన్న పరిశ్రమల ఏర్పాటు వడ్డెర్లకు చిన్న పరిశ్రమల శాఖ ద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుట. 4. కార్పొరేషన్ నిధులు మంజూరు వడ్డెర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కార్పొరేషన్ తరపున తగిన నిధులు మంజూరు చేయాలని కోరుట. 5. సంక్షేమ భవన స్థలం వడ్డెర సంక్షేమ భవన నిర్మాణానికి అమరావతిలో స్థలం కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుట. 6. పనుల్లో సముచిత స్థానం కుల వృత్తులకు చెందిన క్వారీ పనులు, భవన నిర్మాణాలు, రోడ్ల పనుల్లో సముచిత స్థానం కల్పించాలని అభ్యర్థన. 7. కో-ఆపరేటివ్ సొసైటీలు వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరుట. 8. స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం రానున్న స్థానిక ఎన్నికలలో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించాలని తమరిని కోరుట. 9. శ్రమ జీవనంలో భద్రత శ్రమ జీవన రంగంలో పనిచేసే వడ్డెర్లకు ప్రమాదం జరిగినప్పుడు తగిన భద్రత మరియు ఆర్థిక సహాయం అందించాలని కోరుట.