ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గారి ప్రొఫైల్

Vaddera_Corporation_Chairman_Malle_Eswar_Vaddera_portrait_mode
Vaddera_Corporation_Chairman_Malle_Eswar_Vaddera_landscape_mode

చైర్మన్ - మల్లె ఈశ్వర రావు వడ్డెర వారిని గురించి

వ్యక్తిగత వివరాలు

జన్మదినం: 26/10/1980

జన్మస్థలం: గుంటూరు వడ్డెర గూడెం

విద్య: ఎస్.ఎస్.సి.

తల్లిదండ్రులు: మల్లె వెంకటేశ్వర్లు (లేట్) & మల్లె వెంకటమ్మ

ప్రస్తుత వృత్తి: గుంటూరు మున్సిపల్ & క్వారీ సబ్ కాంట్రాక్టర్

కుటుంబ వివరాలు

జీవిత భాగస్వామి: గృహిణి.

కుమార్తె: లా చదువుతున్నారు.

కుమారుడు: బీటెక్ (సివిల్) చదువుతున్నాడు.

బాల్యం, నేపథ్యం

  • మల్లె ఈశ్వర్ వడ్డెర గారు 26/10/1980 సంవత్సరంలో గుంటూరు వడ్డెర గూడెం లో జన్మించారు. వీరు తమ తల్లిదండ్రులైన మల్లె వెంకటేశ్వర్లు, మల్లె వెంకటమ్మ గారికి నలుగురు సంతానంలో నాలుగోవారు. వారి తల్లిదండ్రులు గుంటూరు మున్సిపల్ సబ్ కాంట్రాక్టర్ గా రోడ్ల పనులు చేస్తూ జీవనం గడిపేవారు.
  • వీరి తల్లిదండ్రుల వద్ద వడ్డెర కుల బంధువులు ఎక్కువగా పనిచేసేవారు. అందువలన ఈశ్వర్ గారు బాల్యం నుండే వడ్డెర కుల బంధువులతో అత్యంత సన్నిహితంగా ఉండి వారి కష్టనష్టాలు, సాధక బాధలు ఎక్కువగా తెలిసిన వడ్డెర జాతిబిడ్డగా గుర్తింపు పొందారు. తమ తల్లిదండ్రులతో పాటు కులవృత్తి చేసుకుంటూ జీవనం గడిపారు.

చైర్మన్ గారి లక్ష్యం

గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పగించిన బాధ్యత

ముఖ్య ఉద్దేశాలు & కార్యాచరణ

జాతీయ సంక్షేమ లక్ష్యం

గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతకు తగినట్టుగా, జాతి అభివృద్ధి మరియు సంక్షేమ లక్ష్యంగా నిబద్ధతతో పనిచేయాలి.

సంక్షేమ పథకాల పంపిణీ

గౌరవ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వడ్డెర్లకు అర్హత మేరకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలి.

న్యాయ పోరాటం

ఇబ్బంది పడుతున్న వారి విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలి.

తక్షణ సహాయం

వడ్డెర్లకు ఏ ఇబ్బంది జరిగిన వెనువెంటనే స్పందించి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.

అవసరాల అడ్వకసీ

వడ్డెర సామాజిక వర్గానికి అవసరమైన అంశాలను తెలుసుకొని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించాలి.

పథకాల చేరువ (కూటమి ప్రభుత్వం)

గౌరవ కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వడ్డెర్లకు చేరువ అయ్యేలా చూడటమే నా ప్రధాన లక్ష్యం.

వడ్డెర సేవా సంఘం ట్రస్ట్ - భీమా

ట్రస్ట్ ద్వారా ప్రత్యేక భీమా మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం నా లక్ష్యం.

వడ్డెర సేవా మార్గం

2009 సెప్టెంబర్ 9న తన వడ్డెర జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో గుంటూరు జిల్లా, మేడికొండూరు (మండలం), పేరేచర్ల గ్రామం లో ఆంధ్రప్రదేశ్ వడ్డెర సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

వడ్డెర ప్రజలకు అవసరమైన అన్ని విధాలుగా వారి అవసరాల నిమిత్తం తమ వంతుగా గౌరవ ప్రజా ప్రతినిధులు & అధికారుల దృష్టికి జాతి బిడ్డల సమస్యలను తీసుకువెళ్లి, వారి సమస్యలపై తీవ్రంగా శ్రమించారు.

Vaddera_Corporation_Andhra_Pradesh_Chairma_Malle_Eswara_Rao_Vaddera

రాజకీయ ప్రస్థానం

  1. 2014: బీసీల సంక్షేమం కొరకు శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత గౌ|| మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మక్కువతో ఆ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని పార్టీ కార్యకర్తగా పనిచేశారు.
  2. 2019: వైసిపి పార్టీ వడ్డెర సామాజిక వర్గమైన చంద్రగిరి యేసు రత్నం గారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దించగా, తాను నమ్ముకున్న టీడీపీ కొరకు నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వడ్డెరలు టీడీపీలోనే ఉన్నారని సంఘటితం చేసి, పార్టీ తరఫున సభ నిర్వహించి, అప్పటి MLA & MPల గెలుపులో కీలక పాత్ర పోషించి పార్టీకి విధేయుడు అనిపించుకున్నారు.
  3. ప్రతిపక్షంలో కృషి: అప్పటి నుండి ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి కొరకు అన్ని విధాల పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో విజయం సాధించుటకు తమ వంతు కృషి చేశారు. ఈ క్రమంలోనే టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ గా పని చేసి మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు.
  4. 2024 ఎన్నికలు: పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా పర్యటించి, గత ప్రభుత్వం వడ్డెరలకు కలిగించిన ఇబ్బందుల విషయమై అనేక సభలలో పాల్గొన్నారు. వడ్డెర్లకు అండ – తెలుగుదేశం జెండా అనే నినాదంతో రాష్ట్రమంతా పర్యటించి, కూటమి ప్రభుత్వ విజయంలో తన వంతుగా కృషి చేశారు.

ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం

తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తదుపరి, గౌ|| ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌ|| యువ నేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు (కూటమి ప్రభుత్వం) అంకితభావంతో పార్టీ ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు పనిచేసిన వారిలో ఒకడిగా మల్లె ఈశ్వర్ వడ్డెర గారిని గుర్తించి, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.

ప్రస్తుతం వడ్డెర జాతి కొరకు, టీడీపీ పార్టీ కొరకు తమ వంతు కృషి చేస్తూ, తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Scroll to Top