జన్మదినం: 26/10/1980
జన్మస్థలం: గుంటూరు వడ్డెర గూడెం
విద్య: ఎస్.ఎస్.సి.
తల్లిదండ్రులు: మల్లె వెంకటేశ్వర్లు (లేట్) & మల్లె వెంకటమ్మ
ప్రస్తుత వృత్తి: గుంటూరు మున్సిపల్ & క్వారీ సబ్ కాంట్రాక్టర్
జీవిత భాగస్వామి: గృహిణి.
కుమార్తె: లా చదువుతున్నారు.
కుమారుడు: బీటెక్ (సివిల్) చదువుతున్నాడు.
గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పగించిన బాధ్యత
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతకు తగినట్టుగా, జాతి అభివృద్ధి మరియు సంక్షేమ లక్ష్యంగా నిబద్ధతతో పనిచేయాలి.
గౌరవ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వడ్డెర్లకు అర్హత మేరకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలి.
ఇబ్బంది పడుతున్న వారి విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలి.
వడ్డెర్లకు ఏ ఇబ్బంది జరిగిన వెనువెంటనే స్పందించి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
వడ్డెర సామాజిక వర్గానికి అవసరమైన అంశాలను తెలుసుకొని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించాలి.
గౌరవ కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వడ్డెర్లకు చేరువ అయ్యేలా చూడటమే నా ప్రధాన లక్ష్యం.
ట్రస్ట్ ద్వారా ప్రత్యేక భీమా మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం నా లక్ష్యం.
2009 సెప్టెంబర్ 9న తన వడ్డెర జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో గుంటూరు జిల్లా, మేడికొండూరు (మండలం), పేరేచర్ల గ్రామం లో ఆంధ్రప్రదేశ్ వడ్డెర సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
వడ్డెర ప్రజలకు అవసరమైన అన్ని విధాలుగా వారి అవసరాల నిమిత్తం తమ వంతుగా గౌరవ ప్రజా ప్రతినిధులు & అధికారుల దృష్టికి జాతి బిడ్డల సమస్యలను తీసుకువెళ్లి, వారి సమస్యలపై తీవ్రంగా శ్రమించారు.
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తదుపరి, గౌ|| ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌ|| యువ నేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు (కూటమి ప్రభుత్వం) అంకితభావంతో పార్టీ ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు పనిచేసిన వారిలో ఒకడిగా మల్లె ఈశ్వర్ వడ్డెర గారిని గుర్తించి, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
ప్రస్తుతం వడ్డెర జాతి కొరకు, టీడీపీ పార్టీ కొరకు తమ వంతు కృషి చేస్తూ, తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
: 964-261-3555
: vadderacorporationoffice@gmail.com
©2025, Vaddera Corporation. All Rights Reserved.